epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విశ్వంభర విడుద‌లపై స‌స్పెన్స్ క్లియ‌ర్!

క‌లం వెబ్ డెస్క్‌ : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ట్ తెరకెక్కించిన భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర(Viswambhara). ఈ మూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. విశ్వంభర మూవీని వెనక్కి పెట్టి.. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీని ముందుకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. మన శంకర్ వరప్రసాద్ గారు ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి కానీ.. విశ్వంభర గురించి మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో అభిమానుల్లో సమ్మర్(Summer) కి అయినా వస్తుందా..? మళ్లీ వాయిదా పడనుందా..? అనే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి.

అయితే.. డైరెక్టర్ వశిష్ట్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విశేష్ తెలియచేస్తూ.. అప్ డేట్ ఇచ్చారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈ సినిమా రిలీజ్ ప్లాన్స్ లో ఎలాంటి మార్పు లేదు.. ఈ ఏడాది సమ్మర్ లో విజువల్ ట్రీట్ ని అందిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అయితే.. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా మే 9న రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇది కూడా సోషియో ఫాంటసీ మూవీ కావడంతో సెంటిమెంట్ గా మే 9నే రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు కానీ.. సమ్మర్ లో ఈ భారీ, క్రేజీ మూవీ థియేటర్స్ లోకి రావడం ఖాయం అని చెప్పచ్చు.

ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు క్వాలిటీ విషయంలో నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ రావడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. లేట్ అయినా సరే.. క్వాలిటీ అదిరిపోవాలని చిరు నిర్మాతకు చెప్పారట. అందుకనే.. రిలీజ్ విషయంలో తొందరపడడం లేదట. యు.వీ క్రియేషన్స్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదట. మరి.. విశ్వంభర ఎంత వరకు మెప్పిస్తుందో తెలియాలంటే.. సమ్మర్ వరకు ఆగాల్సిందే.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>