జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll)కు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న పూర్తికాగా.. శుక్రవారంతో నామినేషన్ల ఉపసంహరణ తేదీ కూడా ముగిసింది. ఈ ఉపఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, వాటిలో 186 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. 130 మంది అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో చెల్లనివాటిగా అధికారులు తెలిపారు. దీంతో చివరికి 81 మంది బరిలో ఉన్నారు. శుక్రవారం 23 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా చివరికి 58 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరికి గుర్తుల కేటాయింపు అతి త్వరలో జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: కేసీఆర్‌కు శ్రీశైలం యాదవ్ వార్నింగ్..

