కలం/ఖమ్మం బ్యూరో: కొంత మంది వ్యక్తులు సభ్య సమాజంలో తలదించుకునే పనులు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. అలాంటి ఉదంతం ఒకటి గురువారం ఖమ్మం (Khammam) నగరంలో బయటపడింది. సోషల్ మీడియాలో చిన్నారుల అశ్లీల (చైల్డ్ పోర్నోగ్రఫీ) వీడియోలు చూసి, వాటిని షేర్ చేసిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(TGCSB), నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(NCRP), నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (NCMEC) సిబ్బంది సోషల్ మీడియా మానిటరింగ్‌లో.. నిరంజన్ కుమార్ అనే వ్యక్తి ఫేస్బుక్లో చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూసి, షేర్ చేసినట్లు గుర్తించారు.
వెంటనే అతని వివరాలను ఐపీ అడ్రస్ ద్వారా కనుగొన్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలు చూసి, షేర్ చేసినందుకు చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ అబ్యూస్ మెటీరియల్ (CSEAM) కింద నిందితునిపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఇంటర్నెట్‌లోగాని, సోషల్ మీడియాలో గాని ఎవరైనా చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి సెర్చ్ చేసినా, చూసినా, షేర్ చేసినా చట్ట ప్రకారం నేరమని హెచ్చరించారు.

Read Also: వివాహేతర సంబంధం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Follow Us On: X(Twitter)


