వైభవ్‌కు అవకాశాలివ్వాలి.. గంభీర్‌కు శ్రీకాంత్ వార్నింగ్!

క‌లం, స్పోర్ట్స్: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఇప్పుడు భారత క్రికెట్‌లో పెద్ద చర్చగా మారింది. యూఏఈపై 53 బంతుల్లో 204 పరుగులు బాదడంతో అతడిని సీనియర్ జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్ మళ్లీ పెరిగింది. తాజాగా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) కూడా వైభవ్‌కు మరిన్ని అవకాశాలివ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించారు. అతడి ప్రతిభను గుర్తించి బలమైన నిర్ణయాలు తీసుకోవాలని కోచ్ గౌతమ్ గంభీర్‌కు హితవు పలికారు. ‘‘అవకాశాలు ఇవ్వకుండా గాడిలో పెట్టలేరు. వైభవ్ ఇప్పటికే భారత్ తరఫున 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే జట్టులో స్థానం మాత్రం నిలకడగా దక్కడం లేదు. పూర్తి స్థాయి జట్టు అందుబాటులో ఉన్నప్పుడు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా ఆడుతున్నారు. వైభవ్‌కు అడపాదడపా అవకాశాలే వస్తున్నాయి. అతడిని తీర్చిదిద్దాలంటూ పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదు’’ అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.

వైభవ్ బీహార్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం, దులీప్ ట్రోఫీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించడం, ఈశాన్ కిషన్‌తో కలిసి టైటిల్ గెలవడం వంటి విషయాలను శ్రీకాంత్ గుర్తుచేశారు. అతడు ఇప్పటికే ఉన్నత స్థాయిలో ఆడుతున్నాడని, ప్రతిభకు తగ్గ గుర్తింపు ఇవ్వాలని అన్నారు. వైభవ్ షాట్‌ల ఎంపిక, బంతిని బలంగా బాదే తీరు, టైమింగ్ తనను ఆశ్చర్యపరిచాయని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు కూడా ఇలాంటి షాట్లు ఆడలేదని ప్రశంసించారు. వైభవ్ ఆట చూస్తుంటే అతడికి ఇంత శక్తి, టైమింగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>