రాజ్యాంగ హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం: వీసీ శ్రీనివాస్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: భారత రాజ్యాంగం సామాన్య ప్రజలకు ఓటు హక్కు అనే శక్తివంతమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని అందించిందని పాలమూరు యూనివర్సిటీ (Palamuru University) వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. గురువారం న్యాయ కళాశాల ఆధ్వర్యంలో అకాడమిక్ ఆడిటోరియంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందిందని, రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని గుర్తుచేశారు. ప్రాథమిక హక్కులు, విధులు, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక సూత్రాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వీసీ సూచించారు. గత సంవత్సరం ప్రారంభించిన న్యాయ కళాశాలలో 100 శాతం అడ్మిషన్లు నమోదవడం సంతోషకరమని, నాణ్యమైన అధ్యాపకులు, మౌలిక సదుపాయాలతో పాటు మూట్ కోర్టు, లీగల్ సొసైటీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

అనంతరం వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులతో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు వీసీ, రిజిస్ట్రార్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డా. భూమయ్య, విభాగాధిపతి వెంకట సాయి ప్రసాద్, లా స్టూడెంట్ ఫోరం అధ్యక్షులు సుదీప్ రెడ్డి అధ్యాపకులు ఎం.ప్రియాంక, సీహెచ్ అక్షయ, అశోక్, ఎం.కిరణ్, కె.శ్రీకాంత్, ప్రసన్న కుమార్, డాక్టర్ అనిల్ సింగ్ తో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>