ఆపదలో ఆదుకునే ఇందిరమ్మ జీవిత బీమా: కొండా సురేఖ

కలం, వరంగల్: కుటుంబ పెద్దను కోల్పోయిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Indiramma Bima) పథకాన్ని అమలు చేస్తోందని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకంలో నమోదు చేసుకుని రూ.5 లక్షల బీమా రక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గురువారం ఉర్సు కరీమాబాద్‌లోని సీఆర్‌సీ భవనంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్నతో కలిసి ఆమె (Konda Surekha) పాల్గొన్నారు. కుటుంబ పెద్ద మరణిస్తే పిల్లల చదువులు, కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆర్థిక అండ కల్పించడమే పథకం ఉద్దేశమన్నారు. ప్రభుత్వం ఏటా సుమారు రూ.500 కోట్లను బీమా ప్రీమియంగా చెల్లిస్తోందని తెలిపారు.

కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 4 లక్షల కుటుంబాలకు పథకం ప్రయోజనం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. డిసెంబర్ 18లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ పెద్ద ఆధార్, రేషన్ కార్డులతో నేరుగా నమోదు కేంద్రాలకు వెళ్లాలని, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సూచించారు.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 24 నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి కేంద్రంలో హెల్ప్‌డెస్క్ అందుబాటులో ఉంటుందని కమిషనర్ వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వై.వి.గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : అచ్చంపేట లిఫ్ట్ ప‌నుల‌పై సీఎం కీల‌క హామీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>