బాచుప్ల‌లి ఘ‌ట‌న‌.. సుమోటోగా స్వీక‌రించిన హెచ్ఆర్సీ

క‌లం, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తుండగా విషవాయువులు పీల్చుకుని ముగ్గురు కార్మికులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (Telangana HRC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వార్తా క‌థ‌నాల‌ను పరిశీలించిన కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించింది. తగిన భద్రతా చర్యలు, రక్షణ పరికరాలు లేకుండానే కార్మికులతో ప్రమాదకరమైన పనులు చేయించినట్లు వచ్చిన ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేసింది. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, గౌరవం, హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం జరిగిందా అనే అంశంపై విచారణకు ఆదేశిస్తూ బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌లను సమగ్ర నివేదికలు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచేందుకు అనుసరించాల్సిన భద్రతా నిబంధనల‌ను వివ‌రించాల‌ని పేర్కొంది. అలాగే అపార్ట్‌మెంట్ యాజమాన్యం, కాంట్రాక్టర్ బాధ్యతలు, ఇప్ప‌టి వ‌ర‌కు చేపట్టిన విచారణ, బాధ్యులపై తీసుకున్న చర్యల వివరాలు నివేదికలో పొందుపరచాలని సూచించింది. దీంతో పాటు మృతుల కుటుంబాలకు అందించిన లేదా ప్రతిపాదించిన పరిహారం, ఇతర సహాయ చర్యలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కు చేపట్టనున్నట్లు కమిషన్ పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>