కలం, వెబ్ డెస్క్ : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (Rayalaseema Lift Irrigation) వివాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఒక గొప్ప ఉద్దేశ్యంతో ప్రారంభించాం. తాగటానికి మంచి నీళ్లు కూడా దొరకని ప్రాంతానికి రాయలసీమ లిఫ్ట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదని జగన్ అన్నారు. రాయలసీమ, నెల్లూరు, చెన్నై ప్రాంతాలకు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంజీవని లాంటిదని జగన్ తెలిపారు. అందరికీ, ఈ విషయంపై వాస్తవాలు తెలియాలి.
చంద్రబాబు మాటలు, ఆయన ఇరిగేషన్ మంత్రి మాట్లాడిన మాటలు చూస్తుంటే వీళ్ళు అస్సలు మనుషులేనా అనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీలో ఏకంగా అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మాటలు విన్నాక రైతన్నలకు చంద్రబాబు విలన్ లాగా కనిపిస్తున్నారు. తన మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను చంద్రబాబు ఆపారని రేవంత్ చెబుతున్నారు. ప్రజల దాహాన్ని తీర్చే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదని వీళ్లు బరితెగించి మాట్లాడిన మాటలు.. వారి ఇద్దరి మధ్య జరిగిన రహస్య ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్లేనని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు.


