కలం, వెబ్ డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.1 కోటి 40 లక్షల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేములవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన అనుభూతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని పలు మార్లు కోరారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా కలెక్టర్ గుడి చెరువులో బోటింగ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపగా, అసెంబ్లీలో ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణ రావు త్వరలోనే బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీకి అనుగుణంగానే మంగళవారం (Go.RtNo. 10, Dated 07/01/2026) గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు కోసం రూ.1.40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పత్యేక కార్యదర్శి జయేష్ రంజాన్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నిర్ణయంతో వేములవాడ పట్టణ ప్రజలు, ఆలయానికి వచ్చే భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోటింగ్ ఏర్పాటు ద్వారా పర్యాటక ఆకర్షణ పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని వారు అభిప్రాయపడుతున్నారు. వేములవాడ పట్టణంలో ఒక వైపు రూ. 150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ,రూ. 47 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో నేడు బోటింగ్ ఏర్పాటు కోసం ప్రభుత్వo రూ. కోటి 40 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడంతో వేములవాడ (Vemulawada) పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం, కీలక అంశాలపై చర్చ
Follow Us On: X(Twitter)


