రాజీవ్ గాంధీ చనిపోవాలనే అలా చేశారు: రాహుల్

కలం, వెబ్ డెస్క్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హత్యపై ఆయన కుమారుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆయన చనిపోవాలనే భద్రతను తొలగించారు. అదేం అకస్మాత్తుగా జరిగిందేం కాదు. ప్రణాళిక ప్రకారమే, హత్య జరిగేందుకు అనుకూలమైన వాతావరణం సృష్టించారు. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీని తగ్గించేశారు. 1991లో రాజీవ్ గాంధీ బీహార్ పర్యటనకు వెళ్లినప్పుడు రాళ్ల దాడి జరిగింది. అక్కడ ఆయనకు సరైన భద్రత కల్పించనే లేదు.

దీనిపై ఆందోళన చెంది అప్పట్లోనే కేంద్రానికి ఫిర్యాదు చేశాం. తన తండ్రి భద్రత విషయంలో ఇక నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయన అంత్యక్రియలకు రావాల్సి వస్తుందని నేను స్వయంగా అమ్మ సోనియా గాంధీకి చెప్పాను’ అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. సోనియా గాంధీ బయోగ్రఫీ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం గురించి ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో జరిపిన చర్చలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అసలేం జరిగింది..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తుండగా జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో హత్యకు గురయ్యారు. ఎల్టీటీఈ వేర్పాటువాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కేంద్రం డీ.ఆర్.కార్తికేయన్ ఆధ్వర్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. రాజీవ్ గాంధీ హత్యలో మొత్తం ఏడుగురిని దోషులుగా గుర్తించి, వారిలో నలుగురికి మరణశిక్ష విధించింది. అనంతరం కాలంలో దీన్ని యావజ్జీవ శిక్షగా మార్చేసింది. 1989లో ఏర్పాటైన వీపీ.సింగ్ ప్రభుత్వం రాజీవ్ గాంధీకి ఉన్న ఎస్పీజీ భద్రతను తగ్గించిందని తరచూ గాంధీ కుటుంబ సభ్యులు విమర్శిస్తుంటారు.

Also Read : మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాలు.. టీవీకే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>