కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ – ఎస్‌డబ్ల్యూఎఫ్ జెండా ఆవిష్కరణ (CITU-SWF Flag Hoisting) కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ ముఖ్య అతిథిగా హాజరై సంఘం జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం కార్మికులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలే మార్గమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ – ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

