కలం, సినిమా : అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా ఖ్యాతిని మరోసారి చాటిచెప్పారు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). న్యూయార్క్‌లో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో అవార్డును ప్రెజెంట్ చేసిన తొలి భారతీయ నటుడిగా ఆయన అరుదైన రికార్డు సృష్టించారు. ‘మహారాజ’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆయన, ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రెడ్ కార్పెట్‌పై క్లాసిక్ బ్లాక్ సూట్, మెరిసే నల్లటి షూస్, షార్ప్ సైడ్-పార్టెడ్ హెయిర్ స్టైల్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. భారతీయ సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు తన ఫ్యాషన్ లుక్‌తోనూ అక్కడి వారిని ఆకట్టుకున్నారు. ఈ అరుదైన గౌరవంపై అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు.. అక్రమ బిల్లులపై పోరాటానికి పిలుపు!
Follow Us On: Youtube

