కలం, వెబ్ డెస్క్ : ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో (Uday Krishna Reddy) పోలీసులు మరో కీలక పరిణామాన్ని వెల్లడించారు. ఈ కేసులో ఆయన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డిని A2 నిందితుడిగా చేర్చినట్లు సమాచారం. ఉదయ్ కృష్ణారెడ్డి ఉపయోగించిన ఫోన్ను ప్రణయ్ దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. దీంతో కేసు దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి.
కాగా, మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆరోపణలపై అరెస్టయిన ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న ఆయనకు ఉప్పరపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ, పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సోదరుడిని రెండో నిందితుడిగా చేర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.

