కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్షసూచన (Rain Alert) పొంచి ఉంది. రానున్న నాలుగు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. వర్షాలు కురిసే సమయంలో కొన్ని 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. తెలంగాణతోపాటు ఏపీలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లలు పడే సూచనలున్నాయని వెల్లడించింది.

