నకిలీ పనీర్ ఫ్యాక్టరీపై FSSAI మెరుపు దాడి.. భారీగా రసాయనాలు స్వాధీనం!

కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో ఓ నకిలీ పనీర్ ఫ్యాక్టరీ (Fake Paneer Factory) గుట్టును అధికారులు రట్టు చేశారు. బట్టలు తెల్లగా మెరిసేందుకు వాడే ‘రాణిపాల్’ వంటి ప్రమాదకర రసాయనాలతో కల్తీ పనీర్ తయారు చేస్తున్న ఈ ఫ్యాక్టరీపై FSSAI, ఆహార భద్రతా విభాగం అధికారులు సంయుక్తంగా దాడి చేశారు.

వివరాల్లోకి వెళితే.. రాయ్‌బరేలిలోని హర్‌చంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఘౌరా సమీపంలో ఉన్న ఓ పనీర్ తయారీ కేంద్రంపై అంతర్ జిల్లాల ఆహార భద్రతా బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పనీర్ తెల్లగా కనిపించేందుకు బట్టలకు వాడే ఆప్టికల్ వైట్నర్ (రాణిపాల్), రిఫైన్డ్ పామాయిల్ వంటి హానికరమైన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ప్రమాదకర రసాయనాలు, భారీ మొత్తంలో నకిలీ పనీర్ నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పనీర్ నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఫ్​యాక్టరీ నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>