కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న భారీ చిత్రం పెద్ది (Peddi). ఈ సినిమాని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో చరణ్ కు జంటగా జాన్వీ నటిస్తుంది. దీంతో ఈ క్రేజీ కాంబో మూని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. మార్చి 27న పెద్ది వస్తుందని ప్రకటించారు. మార్చి 26న నాని ప్యారడైజ్ (Paradise) వస్తుందని అనౌన్స్ చేశారు. అయితే.. అటు చరణ్ పెద్ది రావడం ఖాయం అంటున్నారు. ఇటు నాని పక్కా రిలీజ్ అంటున్నాడు. దీంతో నిజంగా ఈ రెండు సినిమాలు వస్తాయా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. నాని ప్యారడైజ్ మూవీ పోస్ట్ పోన్ అయ్యింది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఒక వారం కాదు.. కనీసం ఒక నెలైనా వాయిదా పడుతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ ఎండింగ్ లో గానీ.. మే ఫస్ట్ వీక్ లో గానీ ఈ సినిమాని రిలీజ్ చేస్తారని సమాచారం. దీంతో పెద్దికి లైన్ క్లియర్ అయినట్టే. హడావిడిగా రిలీజ్ చేయడం ఇష్టం లేకనే.. ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల టైమ్ అడిగాడని.. అందుకనే పోస్ట్ పోన్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త లీకైనప్పటి నుంచి చరణ్ కి నాని బయపడ్డాడా అనే మాటలు వినిపిస్తున్నాయి.
అసలు విషయం ఏంటంటే.. ప్యారడైజ్ (Paradise) డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు. దీనికి నాని నిర్మాత. అందుచేత ఇలాంటి టైమ్ లో.. చరణ్ సినిమాకి పోటీగా రిలీజ్ చేయాలి అనుకోరు. అందుకనే పెద్దికి దారిచ్చేస్తున్నారని.. ప్యారడైజ్ పోస్ట్ పోన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Also: వెంకటేష్‌తో కాంబినేషన్ అదిరిపోతుంది – మెగాస్టార్ చిరంజీవి
Follow Us On : WhatsApp


