epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మరోసారి వార్తల్లో ట్రంప్ : ప్రపంచ దేశాధినేతలపై సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) తనదైన దూకుడు స్వభావంతో అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రకంపనలు సృష్టించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, వెనిజువెలా నేత మడురోలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ట్రంప్​.. తాజాగా వాషింగ్టన్‌లో జరిగిన రిపబ్లికన్ చట్టసభ సభ్యుల (House GOP) సమావేశంలో ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

ఔషధాల ధరల విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో జరిగిన చర్చను ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అమెరికాలో ఔషధాల ధరలు తగ్గాలంటే యూరప్ దేశాలు తమ ధరలను పెంచాలని తాను డిమాండ్ చేసినట్లు తెలిపారు. ‘ఫ్రాన్స్ వస్తువులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని నేను మెక్రాన్‌ను హెచ్చరించాను. అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి ‘ప్లీజ్ డొనాల్డ్, ఐ బెగ్ యూ.. నువ్వు ఏది చెబితే అది చేస్తాం, కానీ ప్రజలకు మాత్రం ఈ విషయం తెలియనివ్వద్దు’ అని ప్రాధేయపడ్డారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మెక్రాన్ మాట్లాడే యాసను కూడా ట్రంప్ అనుకరించి చూపడం గమనార్హం. కేవలం 3.2 నిమిషాల్లోనే మెక్రాన్ తన డిమాండ్‌కు తలొగ్గారని ట్రంప్ క్లెయిమ్ చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి కూడా ట్రంప్ (Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత వస్తువులపై 50 శాతం టారిఫ్‌లు విధించడం వల్ల మోదీ ప్రస్తుతం తనపై “అంత సంతోషంగా లేరు” అని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయనతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని చెబుతూనే, రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలని భారత్‌పై ఒత్తిడి తెచ్చినట్లు ట్రంప్​ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.

వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మడురో పట్టుబడటంపై కూడా ట్రంప్ మాట్లాడారు. ఈ ఆపరేషన్‌లో తన ప్రభుత్వం సాధించిన విజయాన్ని డెమోక్రాట్లు గుర్తించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే వెనిజువెలాలోని చమురు నిల్వలపై అమెరికా కంపెనీలకు ప్రవేశం కల్పించేలా ఆ దేశ నేతలపై ఒత్తిడి తెస్తున్నట్లు వెల్లడించారు.

సమావేశంలో ట్రంప్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెక్రాన్‌ను హేళన చేసిన వీడియో అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ లేదా భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ ‘ట్రేడ్ వార్’ విధానాలు భవిష్యత్తులో అంతర్జాతీయ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>