ఢిల్లీలో కలకలం.. పోలీసులపై కత్తితో దాడి

కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులపై (Delhi Police) ఒక వ్యక్తి దాడికి దిగడం కలకలం రేపింది జామా మసీదు స్టేషన్ పోలీసులపై నబీల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఏకంగా 9 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు ఎస్సైలు, ఒక ఏఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి పరారైందుకు ప్రయత్నించగా పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. కాళ్లకు బుల్లెట్లు తగిలి కుప్పకూలిపోవడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన పోలీసులను స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. ఒక కేసులో నిందితుడిగా ఉన్న నబీల్‌ను పోలీసులు స్టేషన్‌కు పట్టుకొచ్చారు. ఈ క్రమంలో అతను కత్తి తీసి గాయపర్చడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమై.. కాల్పులు జరిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు డీసీపీ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>