ఐపీఎల్ వేలం టేబుల్ వ‌ద్ద ధోనీ ఉండ‌డు: ప‌ఠాన్‌

క‌లం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక అడుగు వేసింది. ఆటగాడిగా వీడ్కోలు పలికిన దిగ్గజం ఎంఎస్ ధోనీ (MS Dhoni), ఇప్పుడు సీఎస్‌కే టీమ్ మెంటార్‌గా కొత్త అవతారం ఎత్తాడు. అయితే, డిసెంబర్ 16న జరిగే మెగా వేలంలో సీఎస్‌కే టేబుల్ వద్ద ‘తలా’ ధోనీ కూర్చోడని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తేల్చి చెప్పాడు. జియోస్టార్‌తో మాట్లాడిన పఠాన్, ధోనీ మైండ్‌సెట్‌ను చాలా ఆసక్తికరంగా విశ్లేషించాడు. తనకు తెలిసినంతవరకు ధోనీ వేలం టేబుల్ వద్దకు రాడని పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్ల కోసం బిడ్డింగ్ వేయడం మెంటార్ పని కాదని, యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయడం, తన అపార అనుభవాన్ని పంచడం, జట్టును గెలుపు బాటలో నడిపించడం మాత్రమే ధోనీ బాధ్యత అని పఠాన్ స్పష్టం చేశాడు.

ధోనీ ఎప్పుడూ విషయాలను చాలా సింపుల్‌గా ఉంచడానికి ఇష్టపడతాడని పఠాన్ గుర్తు చేశాడు. ఏ పని ఎవరికి బాగా వచ్చో వారిని ఆ పని చేయనివ్వడం ధోనీ ప్రత్యేకత అని అన్నాడు. ఏళ్లుగా ఛాంపియన్ జట్లను నిర్మిస్తున్న బలమైన మేనేజ్‌మెంట్, థింక్ ట్యాంక్ సీఎస్‌కే సొంతమని, వారి నిర్ణయాలపై ధోనీకి పూర్తి నమ్మకం ఉందని పఠాన్ తెలిపాడు. మైదానం వెలుపల క్రెడిట్ తీసుకోవడానికి గానీ, కెమెరాల ముందు లైమ్‌లైట్‌లో ఉండటానికి గానీ ధోనీ ఎప్పుడూ ఇష్టపడడని పఠాన్ అన్నాడు. ఒకవేళ ధోనీ వేలం టేబుల్ వద్ద కనిపిస్తే తానే ఆశ్చర్యపోతానని పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెంటార్‌గా ధోనీ తనదైన శైలిలో తెరవెనుక నుంచే జట్టుకు మార్గనిర్దేశం చేస్తాడని పఠాన్ వివరించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>