కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో పుట్టిన సదర్ ఆనవాయితీ నేడు కరీంనగర్ కు వచ్చిందని.. యాదవులు అంటే ఒక నమ్మకానికి ప్రత్యేక అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipally Sathyam) అన్నారు. కరీంనగర్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమానికి (Karimnagar Sadar Festival) ఎమ్మెల్యే హాజరై హాజరయ్యారు. సదరు పండుగను ఈ సర్కస్ గ్రౌండ్ లో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. యాదవులు మాట ఇస్తే తప్పరు అని.. ఇచ్చిన మాట కోసం ఎంతకైనా తెగిస్తారని కొనియాడారు. చొప్పదండిలో తనను గెలిపిస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం నన్ను భారీ మెజారిటీతో గెలిపించారని కొనియాడారు.
యాదవుల రుణం తీర్చుకోవడానికి నామినేటెడ్ పదవుల్లో వారికి అవకాశం కల్పిస్తున్నామని మేడిపల్లి సత్యం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అనిల్ కుమార్ యాదవ్ ని అతి చిన్న వయసులో రాజ్యసభకు సభ్యుడిని చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఉట్కూరు నరేందర్ రెడ్డి, మహేందర్ యాదవ్, చర్ల పద్మ, భూస అంజయ్య యాదవ్, లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

