కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని (Lucknow Fire) అత్యంత రద్దీగా ఉండే హుస్సేన్‌గంజ్ ప్రాంతంలోని బర్లింగ్టన్ కూడలిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాన రహదారి మధ్యలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, ఎగిసిపడుతున్న మంటలను చూసి వాహనదారులు, పాదచారులు భయాందోళనలతో పరుగులు తీశారు. దీంతో ట్రాఫిక్ కూడలిలో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని, దాదాపు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలగనప్పటికీ, బూత్‌లో ఉన్న ముఖ్యమైన ప్రభుత్వ పత్రాలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిబూడిదైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

