బీజేపీలో విషాదం.. గుండెపోటుతో ఎంపీ మృతి

కలం, వెబ్ డెస్క్: బీజేపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ రాంరావ్ సఖారామ్ వడ్కుటే (Ramrao Sakharam Wadkute) గుండెపోటుతో మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రెండు రోజుల కిందటే ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 72 ఏళ్ల రాంరావ్ సఖారామ్ వడ్కుటే మహారాష్ట్రలోని పర్భణి ప్రాంతానికి చెందిన నాయకుడు. హింగోలి జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సహకారం రంగంలో కూడా చురుగ్గా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అనంతరం బీజేపీ అధిష్ఠానం ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేసింది.

ప్రధాని మోదీ సంతాపం..

రాంరావ్ సఖారామ్ వడ్కుటే మరణంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. పేదలు, అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. మహారాష్ట్రలో బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు. వడ్కుటే మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా విచారం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>