రెండో పెళ్లికి సిద్ధ‌మైన భ‌ర్త‌.. షాకిచ్చిన భార్య‌..!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ (Uttar Pradesh)లోని ఎటా జిల్లాలో జ‌రిగిన సీఎం సామూహిక వివాహ ప‌థ‌కం కార్య‌క్ర‌మంలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒకేసారి ప‌లు జంట‌ల‌ పెళ్లి జ‌రుగుతున్న స‌ద‌రు కార్య‌క్ర‌మంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఓ జంట వ‌ద్ద‌కు వెళ్లి వ‌రుడిని స్టేష‌న్‌కు లాక్కెళ్లారు. పోలీసుల తీరుతో అక్క‌డున్న వారంతా షాక‌య్యారు. పోలీసులు అత‌డిని తీసుకెళ్ల‌డానికి ప్ర‌ధాన కార‌ణం అత‌డికి ఇంత‌కు ముందే పెళ్లి కావ‌డం, మొద‌టి భార్య‌కు విడాకులు ఇవ్వ‌క‌పోవ‌మే. త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండానే రెండో పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడ‌ని అత‌డి మొదటి భార్య పోలీసులను ఆశ్ర‌యించ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

మారహరా ప్రాంతంలోని మీరా సరాయ్ గ్రామానికి చెందిన ఆకాశ్ అనే యువకుడికి అలీగంజ్‌కు చెందిన సోనీ అనే యువ‌తితో గ‌తంలోనే పెళ్లి జ‌రిగింది. అయితే తాజాగా ఆకాశ్ శివానీ అనే మ‌రో మహిళతో రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. పోలీసులు పెళ్లి జ‌రుగుతున్న చోటుకు చేరుకోక‌ ముందే అతను శివానీ నుదుట సిందూరం దిద్దాడు. ఈ విషయం తెలుసుకున్న ఆకాశ్ మొదటి భార్య సోనీ పోలీసులకు, స్థానిక‌ అధికారులకు సమాచారం అందించింది. పోలీసులు రంగంలోకి దిగి ఆకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమ మధ్య గత మూడేళ్లుగా వివాదం నడుస్తోందని, కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని సోనీ తెలిపింది.

సీఎం సామూహిక వివాహ పథకం కింద ప్రభుత్వం ఒక్కో జంటకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుంది. ఇందులో వధువు బ్యాంకు ఖాతాలో రూ.64,000 జమ చేయడంతో పాటు రూ.21,000 విలువైన బహుమతులు ఇస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా అవివాహితులు, వితంతువులు లేదా చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నవారై ఉండాలి. అధికారులు అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతే పెళ్లికి అనుమతి ఇస్తారు. అలాంటిది వివాదంలో ఉన్న వ్యక్తి ఈ జాబితాలోకి ఎలా వచ్చాడో, పత్రాల తనిఖీలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే కోణంలో యంత్రాంగం విచారణ జరుపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>