ఎల్ నినో కారణంగా తెలంగాణలో తీవ్ర నష్టం : పొన్నం

కలం, వెబ్ డెస్క్: ఎల్ నినో కారణంగా తెలంగాణలో తీవ్ర నష్టం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గాంధీ భవన్‌లో నిర్వహించిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు వివరించారు. సర్ ప్రక్రియతో ఓట్లను తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. రేపు కరీంనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాబోతున్న నేపథ్యంలో.. వారు చేసే అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని కొత్త ఇన్ ఛార్జి బీఎం సందీప్ స్పష్టంగా చెప్పారని మంత్రి వివరించారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో పార్టీ పరమైన కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>