ప్రభాస్‌తో కిష‌న్ రెడ్డి స‌మావేశం..!

క‌లం, వెబ్‌డెస్క్‌: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి నేడు సినీ హీరో ప్ర‌భాస్‌ (Prabhas)ను క‌లిశారు. జూబ్లీహిల్స్‌లోని ప్ర‌భాస్ నివాసానికి వెళ్లిన ఆయ‌న త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్న న‌షా ముక్త్ భార‌త్ ర్యాలీ గురించి చ‌ర్చించారు. ఈ నెల 25న న‌గ‌రంలో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నామ‌ని, త‌ప్ప‌కుండా హాజ‌ర‌వ్వాల‌ని ఆహ్వానించారు. మూడేళ్ల‌లో డ్ర‌గ్స్ ర‌హిత భార‌త్ త‌మ ల‌క్ష్య‌మ‌ని కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రభాస్‌తో క‌లిసి న‌షాముక్త్ భార‌త్ టీ ష‌ర్ట్ ఆవిష్క‌రించారు.

న‌షా ముక్త్ భార‌త్ ప్ర‌చారంలో భాగంగా కిష‌న్ రెడ్డి ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌ను క‌లిశారు. సినీ హీరో నాగార్జున‌ను కూడా పాద‌యాత్ర‌కు ఆహ్వానించి, టీ ష‌ర్ట్ ఆవిష్క‌రించారు. కాగా, ఈ నెల 25, 26, 27వ తేదీల్లో మూడు రోజుల పాటు నషాముక్త్ భారత్ యాత్ర కొనసాగనుంది.

Also Read : ప్రధాని మోదీ ముందుచూపుతో భారీ నష్టం తప్పింది: CTI

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>