ప్రధాని మోదీ ముందుచూపుతో భారీ నష్టం తప్పింది: CTI

కలం, వెబ్ డెస్క్ : అనవసరమైన బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి వల్ల లక్షలాది మంది వ్యాపారులు, స్వర్ణకారులు, ఇన్వెస్టర్లు భారీ ఆర్థిక నష్టాల నుంచి బయటపడ్డారని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ప్రధాని మోదీకి సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ సహా ఇతర ప్రతినిధులు అధికారికంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రధాని సూచన చేసిన సమయంలో కిలో బంగారం ధర రూ.1.90 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది రూ.1.25 కోట్లకు దిగివచ్చిందని (Gold Price Drop), అంటే కిలోపై ఏకంగా రూ.65 లక్షల మేర ధర తగ్గిందని సీటీఐ వివరించింది.

సాధారణంగా జ్యువెలరీ వ్యాపారులు కొన్ని నెలలకు సరిపడా స్టాక్‌ను ముందే కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటారని, ఒకవేళ ప్రధాని హెచ్చరికను పెడచెవిన పెట్టి ఆ గరిష్ఠ ధరల వద్ద కొనుగోళ్లు జరిపి ఉంటే వ్యాపారులంతా తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉండేవారని లేఖలో అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మే 10న సికింద్రాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇచ్చిన సూచన ఫలించిందని వెల్లడించారు. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి ధరలు తగ్గడం సామాన్య కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తోందని సీటీఐ పేర్కొంది.

Also Read : అధిష్ఠానం ఆదేశాలే ఫైనల్: సీఎం రేవంత్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>