కలం, సినిమా : రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మైసా (MYSAA Movie) విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమాను నవంబర్ 27న విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళిక రూపొందించగా, తాజాగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రేక్షకులకు అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు, సాంకేతిక పరంగా ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. అభిమానులు ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదని, కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం హామీ ఇచ్చింది. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న గోండు మహిళ పాత్రలో కనిపించనున్నారు.
Also Read : స్టార్ హీరో సింప్లిసిటీ.. జనరల్ బోగీలో సామాన్యుడిలా ప్రయాణం!
Follow Us On : WhatsApp

