కలం, వెబ్ డెస్క్: దేశ రక్షణలో అగ్నివీరులుగా సేవలందిస్తున్న యువతకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై అగ్నివీరులు నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక వివాహం (Agniveer Marriage Rules) చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో విడత సర్వీసులోకి ఎంపికైన అగ్నివీరులు కొన్ని నిబంధనలకు లోబడి వివాహం చేసుకునేందుకు అనుమతి లభించనుంది.
అయితే, అగ్నివీర్ ల పెళ్లికి కొన్ని షరతుల (Agniveer Marriage Rules) తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మొదటి నాలుగేళ్ల సర్వీసు సమయంలో వివాహం చేసుకోవడానికి అనుమతి ఉండదు. రెండో విడత సర్వీసుకు దరఖాస్తు చేసుకునే సమయంలోనూ అవివాహితులై ఉండాల్సిందే. ఎంపికైన తర్వాత నిర్దేశిత శిక్షణా కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న అనంతరం వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఆ సమయంలో మహిళా అగ్నివీర్ లు గర్భం దాల్చితే మెటర్నరీ బెనిఫిట్స్, సెలవులకు అనుమతి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో రెండో విడత సర్వీసులో కొనసాగే అగ్నివీరులకు వృత్తిపరమైన బాధ్యతలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు ఊరట లభించనుంది.
Also Read : ‘మైసా’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
Follow Us On : WhatsApp

