స్టార్ హీరో సింప్లిసిటీ.. జనరల్​ బోగీలో సామాన్యుడిలా ప్రయాణం!

కలం, వెబ్ డెస్క్: సినిమాల ప్రమోషన్ ల కోసం హీరోలు, డైరెక్టర్లు వినూత్న పద్ధతులను ఎంచుకుంటుంటారు. ఈ క్రమంలో తమిళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని (Vijay Antony)​ తన మూవీ ప్రమోషన్ (Movie Promotion)​ కోసం సరికొత్త ప్రయోగం చేశాడు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సామాన్యుడిలా రైలు జనరల్ బోగీలో ప్రయాణించాడు. చెన్నై నుంచి కోయంబత్తూరుకు కోవై ఎక్స్​ ప్రెస్​ రైలు ఎక్కాడు. తన తాజా చిత్రం అప్పా కుట్టి ప్రమోషన్​ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.

జనరల్​ బోగీలో సామాన్యుడిలా కూర్చోని తోటి ప్రయాణికులతో విజయ్​ ఆంటోని ముచ్చటించాడు. సినిమాకు సంబంధించిన విషయాలను వారితో పంచుకున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ప్రయాణించిన స్టార్ హీరోను (Vijay Antony) చూసిన వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో సినిమా ప్రమోషన్​ కోసం థియేటర్లకు వెళ్లి నేరుగా ప్రేక్షకులను కూడా కలిసేందుకు విజయ్​ ఆంటోని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఏడేళ్ల ప్రేమకు బ్రేకప్.. ప్రియురాలి ఇల్లు తగలబెట్టిన యువకుడు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>