epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్‌గా వీర్లపల్లి శంకర్ ?

కలం డెస్క్: రాష్ట్ర కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్‌గా (Congress BC Cell Chairman) వీర్లపల్లి శంకర్ నియమితులయ్యే అవకాశమున్నది. త్వరలోనే ఏఐసీసీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడనున్నది. పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా వివిధ డిపార్టుమెంట్లను బలోపేతం చేసే ప్రక్రియ మొదలైంది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఇప్పటికే స్పష్టం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం పూర్తయింది. ఎస్సీ సెల్ చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారమే ఉత్తర్వులు జారీచేశారు.

బీసీ సెల్ (Congress BC Cell Chairman) విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను ఏఐసీసీ పరిశీలించింది. వారిలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (కె.శంకరయ్య) ముందు వరుసలో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తర్వాత ప్రకటన వెలువడడమే తరువాయి అని గాంధీభవన్ వర్గాల ద్వారా తెలిసింది.

Read Also: నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై ట్విస్ట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>