కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు (Bike Thief) పాల్పడుతున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం బోనకల్ రోడ్డులో వన్ టౌన్ ఎస్సై వీరేందర్ తన సిబ్బందితో కలిసి శనివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఖమ్మం రూరల్ మండలం చిన్నతండాకు చెందిన ఎస్కే వాజిద్ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా బైక్ దొంగతనాల వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, నిందితుడి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సాధిక్ పాషా తెలిపారు.
పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు వాజిద్పై గతంలో గంజాయి విక్రయం, దొంగతనాలకు సంబంధించి పలు కేసులు ఉన్నట్లు తేలింది. ఆయా కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చినప్పటికీ, ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో వాజిద్కు సహకరిస్తున్న మరో ఇద్దరు నిందితులు సూర్యాపేట జిల్లా అనంతగిరి గ్రామానికి చెందిన పల్లపు వెంకటేష్, కోదాడ పట్టణం మాతనగర్కు చెందిన చింతల నరేష్ పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

