జేఈఈ మెయిన్ అభ్యర్థులకు అలర్ట్.. రేపే చివరి గడువు!

కలం, వెబ్ డెస్క్: జేఈఈ మెయిన్(JEE Main) 2027 సెషన్-1 దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరకుంది. సాధారణ రుసుముతో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేందుకు నవంబర్ 22వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు మాత్రమే గడువు ఉంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి రోజు వెబ్‌సైట్‌పై రద్దీ పెరిగి సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సాధారణ గడువులోగా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించారు. నవంబర్ 23 నుంచి 26వ తేదీ వరకు ఆలస్య రుసుముతో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా దరఖాస్తు ఫారంలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు నవంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుందని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

జేఈఈ మెయిన్ 2027 సెషన్-1 పరీక్షలను జనవరి 2027లో నిర్వహించనున్నారు. పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డుల విడుదల, పరీక్ష కేంద్రాలు తదితర వివరాలను అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>