కలం, జోగులాంబ గద్వాల : జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం కేటిదొడ్డి రైతు వేదికలో కృషి సఖీలకు (Krishi Sakhi) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత, ప్రయోజనాలు, సాగు విధానాలపై అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించి, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించేలా కృషి సఖీలు కీలక పాత్ర పోషించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం. వీరప్ప, సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రతాప్ కుమార్, వ్యవసాయ అధికారులు శ్రీలత, హన్మంతు రెడ్డి, రాజవర్ధన్, ఏఈఓలు, కృషి సఖీలు, రైతులు పాల్గొన్నారు.

