కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అధిష్టానం రాబోయే శాసన సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలకు పార్టీ ఎన్నికల పరిశీలకులను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ని పార్టీ అధిష్టానం నియమించింది. రెండు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడంతో పాటు ఆయా రాష్ట్రాలలో పార్టీ శ్రేణులను సమన్వయంచేసి.. ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో పరిశీలకులు కీలక పాత్ర పోషించనున్నారు. మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ముఖుల్ వాస్నిక్, ఖాజీ మోహినోద్దీన్ నిజమోద్దీన్ లను ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది.
Read Also: మిల్కాసింగ్.. 15 ఏళ్లకే ఇండియా నెం.1
Follow Us On: X(Twitter)


