కలం/ఖమ్మం బ్యూరో : కేటీఆర్ ఖమ్మంలో పర్యటిస్తున్న టైమ్ లోనే మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Thummala Nageswara Rao) పెద్ద స్కెచ్ వేసేశారు. బీఆర్ ఎస్ కు చెందిన కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి లాగేశారు. రీసెంట్ గానే ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా బుధవారం మరో ముగ్గురు చేరారు. ఇప్పటికే మూడొంతుల మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ రోజు తోట ఉమారాణి, ధనాల రాధ, రుద్రగాని శ్రీదేవితో పాటు మిగతా కార్పొరేటర్లు ప్రత్యేక బస్సులో హైదరాబాద్ వెళ్లారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గంను రద్దు చేసి ఫిబ్రవరిలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని సీఎంకు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని కేటీఆర్ ప్రధానంగా పర్యటన పెట్టుకుంటే.. ఇంకోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Thummala Nageswara Rao) ఇలా షాక్ ఇచ్చేశారని స్థానిక నేతలు అంటున్నారు. మరి మంత్రి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పైచేయి సాధిస్తారా లేదా అనేది చూడాలి.
Read Also: ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీ కీలక బాధ్యతలు
Follow Us On : WhatsApp


