కలం, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (KRMB) సంచలన లేఖ రాసింది. ఈ మేరకు నీటి పంపకాల వినియోగంపై హెచ్చరించింది. తెలుగురాష్ట్రాల్లో నిర్మిస్తోన్న పలు అనుమతి లేని ప్రాజెక్టులపై అభ్యంతరం తెలిపింది. ఇష్టానుసారంగా ప్రాజెక్టులు నిర్మిస్తే నీళ్లపై అధికారాలు రాబోవని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాలు సమన్వయంతో నీళ్లను వాడుకోవాలని పేర్కొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014), కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. కృష్ణా నదిపై చేపట్టే ఏ ప్రాజెక్టుకైనా ముందుగా ప్రాజెక్టు సమగ్ర వివరణ (DPR) సమర్పించాలని తెలిపింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు కచ్చితంగా తీసుకోవాలని పేర్కొంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే.. వాటి ద్వారా అదనపు నీటి కేటాయింపులు, జలాలపై చట్టబద్ధమైన అధికారాలు ఎట్టిపరిస్థితుల్లో లభించబోవని లేఖలో ప్రస్తావించింది.
Also Read : రాజగోపాల్ వ్యాఖ్యలపై రేవంత్ స్ట్రాంగ్ రియాక్షన్
Follow Us On: Youtube

