కలం, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్య నారాయణ కుమార్తె బొత్స అనూష (Botcha Anusha) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేస్తున్నారని, టీడీపీ శ్రేణులే ఈ చర్యలకు పాల్పడుతున్నారని పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బొత్స అనూష ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆమె ఓటమిపాలయ్యారు. దీనిపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను గౌరవించాలని నీతులు చెప్తూనే ఇలా చీప్ ట్రోల్స్ చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలను విమర్శించింది.
ఇక తాజాగా అనూష నేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అనూషను ట్రోల్ చేసిన వీడియోలను తక్షణమే సోషల్ మీడియా నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ట్రోలింగ్ వీడియోలపై నవంబర్ 12న అనూష సైబరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తనపై ట్రోల్స్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె నేడు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుతో అనూషకు ఊరట లభించింది.

