వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జగదీశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి

కలం, మునుగోడు : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి (Jagadish Reddy) , మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సందర్శించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. రైతులు ధాన్యం విక్రయించేందుకు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని, తేమ శాతం, ఇతర నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>