శంకరమ్మకు పదవి ఇవ్వని కేసీఆర్: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఉద్యమం ముసుగులో కల్వకుంట్ల కుటంబం రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ఒకప్పుడు ఏమీ గతి లేని హరీశ్ రావుకు రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో కిరోసిన్ పోసుకుని హరీశ్ రావు (Harish Rao) డ్రామాలు ఆడారని విమర్శించారు. కానీ, శ్రీకాంతాచారి మాత్రం పెట్రోల్ పోసుకుని అమరుడయ్యాడని గుర్తు చేశారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తల్లి శంకరమ్మకు ఎందుకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శంకరమ్మను స్టేజీపైకి పిలిపించగా.. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపు ఆమె కంటనీరు పెట్టారు.

ఒక్కొక్కరికి రూ.వేల కోట్ల ఆస్తులు..

కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కొక్కరు రూ.వేల కోట్ల ఆస్తులు, ఫాంహౌస్ లు సంపాదించుకున్నారని సీఎం రేవంత్ (CM Revanth Reddy) విమర్శించారు. కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు ఇప్పుడెలా ఉన్నారని పేర్కొన్నారు. హరీశ్ రావుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి చనిపోతే.. ఆయన కుటుంబాన్ని అనాథగా వదిలేశారన్నారు. హరీశ్ రావు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినందునే రెండోసారి ఆయనకు నీటిపారుదల మంత్రిగా కేసీఆర్ అవకాశం ఇవ్వలేదని.. ఇది నిజమా.. కాదా.. అని చెప్పాలన్నారు. హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి, తెలంగాణకు తీవ్ర నష్టం చేశారని వివరించారు.

Also Read : సిద్దిపేట మెడికల్ కాలేజీకి కొత్త పేరు.. సీఎం రేవంత్ ప్రకటన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>