సిద్దిపేట మెడికల్ కాలేజీకి కొత్త పేరు.. సీఎం రేవంత్ ప్రకటన

కలం, వెబ్ డెస్క్: సిద్దిపేట మెడికల్ కాలేజీకి తెలంగాణ ఉద్యమకారుడు, సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్ (Madan Mohan) పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. రెండు రోజుల్లో జీవో విడుదల చేయాలని వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహను ఆదేశించారు. సిద్దిపేట పట్ణణంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ సహా సుమారు రూ.550 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వేదికపై నుంచే శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన మదన్‌మోహన్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్.. గురువునే మోసం చేశారని విమర్శలు గుప్పించారు. ఆయన్ను మోసం చేసి సిద్దిపేట ఎమ్మెల్యే ఎన్నికైన కేసీఆర్.. తరువాత టీడీపీని మోసం చేసి కొత్త పార్టీ పెట్టుకున్నారని పేర్కొన్నారు.

మరోవైపు.. వైఎస్సార్ దయతో మంత్రిగా నియమితులైన హరీశ్ రావు.. తరువాత సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని సీఎం రేవంత్ (CM Revanth Reddy) గుర్తు చేశారు. తనకు అవకాశమిచ్చిన కాంగ్రెస్ పార్టీని సిద్దిపేటలో లేకుండా చేసేందుకు హరీశ్ రావు ఎన్నో కుట్రలు చేశారని వివరించారు. ఇలా మదన్ మోహన్ పేరును లేకుండా చేసేందుకు కేసీఆర్, హరీశ్ రావు తీవ్రంగా ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2029లో రెండోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చి, పేదల సంక్షేమ పథకాలు కొనసాగిస్తానని సిద్దిపేట గడ్డపై నుంచి మాట ఇస్తున్నట్లు తెలిపారు.

Also Read : కాంగ్రెస్ నేతలు తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తాం: కేటీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>