కలం, వెబ్ డెస్క్: శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు హరీశ్ రావు (Harish Rao) పాలు అమ్ముకుంటూ దోపిడీ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. ముకుంద డెయిరీ కంపెనీని కబ్జా చేసి.. లాక్కుని పాల దోపిడీకి తెగబడినట్లు వివరించారు. అలాంటి వ్యక్తి తనపై మాట్లాడమేంటన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ హరీశ్ రావు వీటిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు హరీశ్ రావు బయట కంటే ఎక్కువ ధరలకు పాలు అమ్ముకుంటున్నాడని విమర్శించారు. ఇవి కాకుండా, హరీశ్ రావు భార్యకు మెయినాబాద్ ఫాంహౌస్, హరీశ్ రావుకు రంగనాయక్ సాగర్ పక్కన ఫాంహౌస్, ఆయన మామకు 130 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఆరోపించారు.
కేటీఆర్ వ్యాపారాలు నాకు తెలుసు..
కేటీఆర్ (KCR) ఎవరెవరితో వ్యాపారాలు చేస్తున్నాడో తనకు తెలుసని.. అసెంబ్లీకి వస్తే అందరి లెక్కలు బయటపెడుతానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. సంతోష్ రావు రోజుకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి లిక్కర్ దందా చేశాడని గుర్తు చేశారు. చివరికి బతుకమ్మ చీరల్లో కమీషన్లు కొట్టారని.. అది ఒక బ్రతుకేనా అని ఘాటుగా విమర్శించారు. అధికారులు గంట డ్యూటీకి రాకపోతేనే చర్యలు తీసుకుంటారని.. మరి ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ మూడేళ్లుగా అసెంబ్లీకి రాకపోతే ఎలాంటి శిక్ష వేయాలని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిపోతే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమన్నారు.
Also Read : సిద్ధిపేటపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తే మంత్రి పదవి: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

