కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు స్థానం దక్కలేదు. ఈ అంశంపై విమర్శలు వెల్లువెత్తాయి. సీనియర్ ఆటగాళ్లు సైతం కోచ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అసలు సిరాజ్‌ను ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలన్నారు. తమకు తెలిసి సిరాజ్ ఫామ్ అద్భుతంగా ఉందని, గాయాలు కూడా అతనికి లేవని, అలాంటప్పుడు ఎందుకు పక్కనపెట్టారన్న ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే సిరాజ్‌ను పక్కన పెట్టడంపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ (Sitanshu Kotak) తాజాగా స్పందించారు.
సిరాజ్(Mohammed Siraj)ను తప్పించడం తప్పు కాదని ఆయన స్పష్టం చేశారు. సిరాజ్ విషయంలో ఎలాంటి సమస్యా లేదని కొటక్ తెలిపారు. కేవలం మొదటి రోజు ఆట కోసం జట్టును ఎంపిక చేయలేదని కోచ్ చెప్పారు. రెండు, మూడు, నాలుగు రోజుల ఆటను కూడా దృష్టిలో ఉంచుకున్నామని అన్నారు. ఆ సమయానికి ఇదే అత్యుత్తమ తుది జట్టు అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇక ముందు రోజుల ఆటలో పిచ్, పరిస్థితులను బట్టి జట్టు వ్యూహాలు మారే అవకాశం ఉంది.
Also Read : పాక్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై ఇషాన్ కామెంట్స్
Follow Us On : WhatsApp

