కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) పట్టణంలోని బండారి గార్డెన్స్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా, జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 370 మంది లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Sanjay Kumar) మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల మంజూరు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు కొలుగూరి దామోదర్ రావు, సందీప్ రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ అబ్బూరి మల్లేశం గౌడ్, ఎంపీడీఓ రమాదేవి, ఎంపీఓ రవిబాబు, జిల్లా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బొలిశెట్టి గంగారెడ్డి, కట్ట రాజేందర్, అసెంబ్లీ యూత్ అధ్యక్షులు భూమారెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : పాక్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై ఇషాన్ కామెంట్స్
Follow Us On : WhatsApp

