కలం, వెబ్ డెస్క్: విద్యలో ఏపీని నెంబర్ వన్ చేయడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న #GTA6 గ్రాఫిక్ స్టైల్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘జీటీఏ ఫ్యాన్స్.. 13 ఏళ్ల కింద రాజకీయాల్లోకి వచ్చాను. యువగళం పేరిట 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. 2019లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయాను. మళ్లీ అదే స్థానం నుంచి 2024లో పోటీ చేసి 91,413 ఓట్ల మెజార్టీతో గెలిచాను. కొన్ని సార్లు వెయిట్ చేయడం నిజంగా ఎంతో విలువైనదే. ఏపీకి ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. జీటీఏలోకి లాగిన్ అవుతున్నవారు ఆటను ఎంజాయ్ చేయండి’ అంటూ చెప్పారు.
అసలేంటీ GTA6..
జీటీఏ6 అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరొందిన వీడియో గేమ్. ప్రముఖ గేమింగ్ సంస్థ రాక్ స్టార్ గేమ్స్ దీన్ని రూపొందించింది. గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 అని అర్థం. జీటీఏ5 వెర్షన్ 2013లో రాగా.. జీటీఏ6 వెర్షన్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. దీన్ని రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుని పోస్టులు పెడుతుండటంతో ట్రెండ్ అవుతోంది. అప్పటికి, ఇప్పటికి వచ్చిన మార్పును చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం.
Also Read : వైకుంఠ ద్వార దర్శనాలు.. భక్తులకు టీటీడీ తీపికబురు
Follow Us On : WhatsApp

