హెచ్‌ఐవీ నియంత్రణలో జోగులాంబ గద్వాలకు గుర్తింపు

కలం, జోగులాంబ గద్వాల: జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ, నివారణ కార్యక్రమాల అమలులో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది కనబరిచిన పనితీరు అభినందనీయమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్(Rizwan Basha Shaik) ప్రశంసించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనలో గణనీయమైన ప్రగతి కనబరిచి, జిల్లా సురక్షిత్ కేటగిరీలో గుర్తింపు పొందిన నేపథ్యంలో నాకో డిప్యూటీ డైరెక్టర్ మేఖల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గురువారం ఐడీఓసీలో జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసి సన్మానించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Rizwan Basha Shaik) మాట్లాడుతూ.. నాకో ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మాన్ సమరోహ్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సురక్షిత్ కేటగిరీకి ఎంపికైన 20 జిల్లాల్లో జోగులాంబ గద్వాల జిల్లా చోటు సంపాదించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ గుర్తింపు జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నియంత్రణ విభాగం అధికారులు, ఐసీటీసీ, ఏఆర్టీ, సీఎస్‌సీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, సంబంధిత సిబ్బంది సమష్టి కృషి, సమన్వయంతో సాధ్యమైందని తెలిపారు.

సాధించిన విజయంతో సంతృప్తి చెందకుండా ఇదే స్ఫూర్తితో హెచ్‌ఐవీ వ్యాప్తి నివారణ, విస్తృత స్థాయిలో పరీక్షలు, సకాలంలో చికిత్స అందించడం, హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి నిరంతర వైద్య సేవలు కల్పించడం వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాకో డిప్యూటీ డైరెక్టర్ మేఖల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సంధ్య కిరణ్మయి, ప్రోగ్రాం అధికారి రాజు, ఇతర అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Also Read : బీఎస్-6 వాహనదారులకు భారీ శుభవార్త

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>