ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ.15000 జమ !

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని స్వయం ఉపాధి ఆటో, క్యాబ్ ఓనర్ డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ‘ ఆటో డ్రైవర్ సేవలో’ (వాహన మిత్ర) (Auto Driver Sevalo) పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం అర్హులైన డ్రైవర్లకు ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన నిధులను మంగళవారం రూ.231 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వాహనాల బీమా (ఇన్సూరెన్స్), ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, మరమ్మతులు వంటి వార్షిక ఖర్చుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ నిధులను మంజూరు చేసింది. సొంతంగా ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండి, స్వయంగా వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్లకు త్వరలోనే ఈ ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. ఇతర సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు ఈ పథకం వర్తించదు. అర్హులైన లబ్ధిదారులు తమ సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాలు లేదా అధికారిక పోర్టల్ ద్వారా తమ దరఖాస్తు, పేమెంట్ స్టేటస్‌ను పరిశీలించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>