కలం, స్పోర్ట్స్: గాంగ్టక్లో జరుగుతున్న 49వ నేషనల్ జూనియర్ (అండర్-19) బ్యాడ్మింటన్ (Junior Badminton) ఛాంపియన్‌షిప్స్‌లో మంగళవారం భారీ సంచలనాలు నమోదయ్యాయి. రాజస్థాన్ షట్లర్ స్నేహ లాంబా (Sneha Lamba), మహారాష్ట్ర ఆటగాడు తనయ్ మెహెందాలే (Tanay Mehendale) సీడెడ్ ఆటగాళ్లను చిత్తు చేసి మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్లో బాలికల నాలుగో సీడ్ తన్వి రెడ్డి అండ్లూరిని స్నేహ లాంబా 15-12, 15-6 తేడాతో ఓడించింది. బాలుర విభాగంలో ఆరో సీడ్ శౌర్య మిశ్రాకు తనయ్ 15-13, 16-14 స్కోరుతో షాక్ ఇచ్చాడు.
మరోవైపు టాప్ సీడ్లు షైనా మణిముత్తు, నిశ్చల్ ఆనంద్ మూడు గేముల పోరాటంలో కష్టపడి గెలిచారు. నైషా కౌర్‌పై షైనా (15-9, 11-15, 15-5), ప్రాంగణ్ చౌదరిపై నిశ్చల్ (15-11, 14-16, 15-10) విజయం సాధించారు. బాలుర 11వ సీడ్ సాయి నచికేత్ భట్రాజు, 13వ సీడ్ హర్షద్ షాదీష్ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. 7వ సీడ్ జ్ఞాన దత్తు టీటీ, 3వ సీడ్ అభినవ్ గార్గ్, 11వ సీడ్ దుర్గా ఈషా కండ్రాపూర్ సునాయాసంగా ముందంజ వేశారు.
తొలి రోజు జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో ప్రిన్స్-ఇషితా నేగి, అమిత్ రాజ్-సుహినా రాయ్, భాను ప్రతాప్-కావ్య స్వామి, శత్రుదు బనిక్-అద్రిజా డే జంటలు గెలుపొందాయి. బాలుర సింగిల్స్‌లో అర్నవ్ యాదవ్, వేదాంశ్ నేగి విజయాలు నమోదు చేశారు. తదుపరి రౌండ్లలో పోటీ మరింత రసవత్తరంగా సాగనుంది.

