కలం వెబ్ డెస్క్ : మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు సిద్ధమైన రాజాసాబ్ (Raja Saab), మన శివశంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమాల టికెట్స్ ధర పెంచుకునేందుకు(Ticket Price Hike), ప్రీమియర్ షోలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ సినిమాల టికెట్స్ ధర పెంపుపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్ సీఎస్‌ను ఆదేశించింది. గతంలో సినిమా టికెట్స్ ధరల పెంపుపై సింగిల్ బెంచ్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాజాసాబ్, మన శివశంకర్ వరప్రసాద్ గారు సినిమాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాలకు తక్కువ ధరలతో వసూళ్లు రాబట్టడం కష్టమని తెలిపారు. దీనిపై విచారించిన కోర్టు గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు గేమ్ ఛేంజర్, పుష్ప 2, అఖండ 2 సినిమాలకే వర్తిస్తాయని, ఈ సినిమాలకు వర్తించవని తీర్పునిచ్చింది. దీంతో చిరంజీవి , ప్రభాస్ సినిమాల టికెట్స్ ధర (Ticket Price Hike) పెంచుకునేందుకు మార్గం సుగమం అయ్యింది.
Read Also: 6 నిమిషాల డ్యాన్స్‌కు 6 కోట్లు
Follow Us On: X(Twitter)


