కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్‌ను (JNTU Sultanpur Campus) భవిష్యత్తులో యూనివర్సిటీగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన విశాలమైన ప్రాంగణం, అన్నిరకాల, వసతులు అఫ్లియేషన్‌కు సరిపడా కాలేజీలు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.
2012లో తాము అధికారంలో ఉన్నప్పుడు జేఎన్టీయూ క్యాంపస్‌ను సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేయించానని, సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్‌ను (JNTU Sultanpur Campus) యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలన్న ఆలోచన తనకు ఉందన్నారు. భవిష్యత్తులో ఆ దిశగా చర్యలు తీసుకుంటామని మంగళవారం శాసనమండలిలో యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయని, ఇక్కడి పరిశ్రమలకు అవసరమైన స్కిల్డ్ కోర్సెస్ అందించే అద్భుతమైన యూనివర్సిటీని భవిష్యత్తులో ఏర్పాటు చేసే ఆలోచన చేస్తామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.


