కలం, నిర్మల్: ప్రజావాణి దరఖాస్తుల (Prajavani Applications) పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు (Additional Collector Venkateshwarlu) అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావు తో కలిసి ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్లో పిల్లల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి ఏర్పాటు చేశారు. ఈ పిల్లల ప్రజావాణికి పలువురు తమ వినతులు అందజేశారు. ఈ ప్రజావాణిలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read : ఆదాయానికి మించి ఆస్తులు.. అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు
Follow Us On : WhatsApp

